ఆసరా పెన్షన్ల పథకం కింద ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి 38,32,801 మందికి లబ్ధి చేకూరిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆసరా పెన్షన్ల పథకానికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
పెన్షన్ల విషయంలో బీజేపీ నాయకులు అపోహలు సృష్టిస్తున్నారని…పెన్షన్లు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వమేనని తెలిపారు ఎర్రబెల్లి. పెన్షన్‌దారులందరూ కేసీఆర్ ను పెద్దకొడుకుగా భావిస్తున్నారని…. కేసీఆర్‌ను ఎంతో గొప్పగా గౌరవిస్తున్నారని తెలిపారు.
ఈ పథకానికి ఇప్పటి వరకు 31,902 కోట్ల 91 లక్షల మొత్తాన్ని ఖర్చు చేసిందని తెలిపారు. ఒక నెలకు 977 కోట్లు ఖర్చు పెడుతున్నామని స్పష్టం చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు,చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులతో పాటు ఒంటరి మహిళలకు, హెచ్ఐవీ, మలేరియా వ్యాధిగ్రస్తులకు కూడా ఆసరా పెన్షన్ల పథకాన్ని వర్తింపజేశామన్నారు.