ఫార్మాసిటీని అడ్డుకునేందుకు కుట్రలు: మంత్రి కేటీఆర్

197
ktr

హైదరాబాద్ ఫార్మాసిటీని అడ్డుకునేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేటీఆర్…అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మాసిటీ ఏర్పాటు కాబోతుందన్నారు.

ఫార్మాసిటీ కోసం ఇప్పటివరకు 8 వేల ఎకరాల భూసేకరణ చేశామని…మరికొంతభూమి సేకరించాల్సి ఉందన్నారు. డీపీఆర్‌ను అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత‌నే ప‌రిశ్ర‌మ‌ల‌కు భూములు కేటాయిస్తున్నామ‌ని, ఆ భూముల‌ను ప‌రిశ్ర‌మ‌లు వినియోగించ‌క‌పోతే వెనక్కితీసుకుంటున్నామ‌ని వెల్ల‌డించారు.

భూసేక‌ర‌ణ‌కు స్థానిక నేతలు, యువ‌త స‌హక‌‌రించార‌ని తెలిపారు. భూ నిర్వాసితుల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. న‌ష్ట‌పోయిన భూమికి ప‌రిహారంగా తిరిగి భూమి చెల్లించే యోచ‌న‌లేద‌ని చెప్పారు.