మంత్రి ఎర్రబెల్లి కన్నీటి పర్యంతం..

127
- Advertisement -

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీటి పర్యంతమైయ్యారు. వివరాల్లోకి వెళ్లితే.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట మండలం కుర్రారం గ్రామంలో దోసల వాగులో జనగామ జిల్లా చిన్నమడూర్ గ్రామ ఎంపిటిసి గోడుగు సుజాత మల్లికార్జున్ కుమార్తె సిందూజ సోమవారం వాగులో కొట్టుకొని పోయి మృతి చెందింది.

ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి మంగళవారం ఉదయం చిన్నమడూర్ గ్రామంలో సిందూజ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళుల‌ర్పించారు. సిందుజ మృతదేహాం వద్ద మంత్రి కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ సందర్భంగా మృతురాలి తండ్రి మల్లికార్జున్‌ను, కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం తరుపున అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

- Advertisement -