త్వరలోనే 5వ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. ఈసందర్భంగా నేడు అరణ్య భవన్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. ఈ సమావేశంలో అన్ని జిల్లాలకు చెందిన అటవి శాఖ అధికారులు పాల్గోన్నారు.మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది నర్సరీల్లో 100 కోట్ల మొక్కల పెంచామన్నారు.
5వ విడత హరితహారంపై సన్నాహాలు, నర్సరీల్లో మొక్కల సంసిద్దత పై ఈకార్యక్రమంలో మాట్లాడారు. అటవీశాఖ పరిధిలో అమలవుతున్న ఇతర కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.
తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతలు పూర్తీ చేసుకున్న ఈకార్యక్రమం త్వరలోనే ఐదవ విడత కార్యక్రమం చేపట్టనుంది. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తీసుకున్న ఈనిర్ణయానికి దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తోంది.