ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: కేటీఆర్

185
ktr minister
- Advertisement -

రాష్ట్రంలోని భాషా పండితులు మరియు వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఇచ్చిన అప్గ్రేడేషన్ జీవో.15 అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నట్లు రాష్ట్ర పురపాలక మరియు ఐ.టి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు – తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు జగదీష్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శానమోని నర్సింహులుకు స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆర్ యు పి పి టి ఎస్ వార్షిక క్యాలెండర్‌ను మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు.

ఈ సందర్భంగా అప్గ్రేడేషన్ జీవో.15 అమలు గురించి ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించగా మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నదని అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, ఆలస్యం అయిన మాట వాస్తవమన్నారు, కోర్టు వ్యాఖ్యానించినట్లుగా నియామక ఉత్తర్వుల్లో (11&12 జీవోల్లో) స్వల్ప మార్పులను చేసి, తప్పకుండా జీవో.15 అమలు చేసి భాషాపండితులకు న్యాయం చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా జీవో 330 ద్వారా అప్గ్రేడ్ కాబడిన గ్రేడ్ -1 పండితుల పెన్షన్ రికవరీని కూడా పరిశీలించి వారికి గొడ్డలి పెట్టులా ఉన్న రికవరీని నిలుపుదల చేయవలసిందిగా కోరగా ఏ.జి. ద్వారా జరుగుతున్న రికవరీని నిలుపుదల చేయడానికి మంత్రి కేటీఆర్ హామీ ఇస్తూ.. గతంలో కోర్టు కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని రికవరీ నిలుపుదల చేయడానికి తగు ఉత్తర్వులు ఇప్పిస్తుందని సంబంధిత మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత త్వరలో..అప్గ్రేడేషన్ జీవో.15 అమలుకు మార్గదర్శకాలు మరియు జి.ఓ. 330 ద్వారా అప్గ్రేడ్ కాబడిన గ్రేడ్-1 పండితుల పెన్షన్ రికవరీ నిలుపుదల చేయడానికి కావలసిన ఉత్తర్వులను ఇప్పిస్తానని కేటీఆర్‌ హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆర్ యు పి పి టి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నర్సింహులు గారు గౌరవ సలహాదారు లచ్చయ్య గారు నాయకులు వెంకటేశ్వర్లు,హరికృష్ణ,నర్సింగ్రావు,ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -