కేంద్రం నుండి జీఎస్టీ పరిహారం విడుదల..

38
gst

జీఎస్టీ విధానం వల్ల పలు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న నష్టాలను భర్తీ చేయడానికి మరోసారి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిహారం విడుదల చేసింది. స్పెషల్ బారోయింగ్ ప్లాన్ లో భాగంగా రాష్ట్రాలకు ఇప్పటివరకు రూ. 60 వేల కోట్ల పరిహారం విడుదల చేసింది. ఇందులో 10వ విడతగా అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 6వేల కోట్లు విడుద‌ల చేసింది. ఇక స్పెషల్ బారోయింగ్ ప్లాన్‌లో భాగంగా కేంద్రం తెలంగాణ‌ రాష్ట్రానికి రూ. 947.73 కోట్ల పరిహారం విడుద‌ల చేసింది.