భూసంస్కరణలు మొదలు పెట్టి పేదలకు తన భూమిని పంచిన మహానుభావుడు పీవీ నరసింహరావు అని గుర్తుచేశారు మంత్రి కేటీఆర్. పీవీకి భారతరత్న ఇవ్వాలని తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…పీవీకి భారతరత్న ఇవ్వాలని సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తున్నామని తెలిపారు.
ఈశ్వరీభాయి, భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాపరెడ్డి, దొడ్డి కొమురయ్య, పైడి జయరాజ్, చాకలి ఐలమ్మ లాంటి ఎందరినో తెలంగాణ సాంస్కృతిక శాఖ గౌరవించుకుంది. మహానుభావుల జయంతి, వర్ధంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నామని తెలిపారు.
పీవీ నరసింహరావు అద్భుతమైన వ్యక్తి. ఏ రంగంలో తనకు బాధ్యతలు అప్పజెప్పిన.. ఆ రంగంలో సంస్కరణలు చేపట్టి ప్రజలకు ఎంతో మేలు చేశారని వెల్లడించారు కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్న ప్రకటించాలన్నారు. తెలంగాణకు సంబంధించిన ఎంతో మందివైతాళికులను గుర్తించి గౌరవించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.