గొప్ప రంగస్ధల నటుడు…జయప్రకాశ్‌ రెడ్డి: సీఎం కేసీఆర్

100
kcr cm

ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం…విభిన్న పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. గొప్ప రంగస్ధల నటుడిగా జయప్రకాశ్‌రెడ్డికి ప్రజల్లో అభిమానం ఉందన్నారు.

గుంటూరులోని తన నివాసంలో ఇవాళ ఉదయం గుండెపోటుతో జయప్రకాశ్ రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. గుండెపోటు రావడంతో బాత్‌రూమ్‌లోనే చనిపోయారు జయప్రకాశ్‌ రెడ్డి. ఆయన మృతితో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది.