29న మైండ్ స్పెస్ జంక్షన్ కు మెట్రో

631
hyderabad metro
- Advertisement -

ఐటి ప్రాంతానికి మరింత చేరువుగా మెట్రో పరుగులు పెట్టబోతుంది. ఇప్పటికే హైటెక్ సిటి వరకు పరుగులు పెడుతున్న మెట్రోను మరో కిలో మీటర్ పోడిగించి మైండ్ స్పెస్ జంక్షన్ వరకు నడపాడానికి అధికారులు సిద్దమౌతున్నారు. ఈ నెల 29న ఈ మార్గాన్ని ప్రారంభించనున్నారు అధికారులు. మైండ్ స్పెస్ జంక్షన్ వరకు రైలు అందుబాటులోకి రావడం ద్వారా ఇనార్బీట్ మాల్ మార్గంలో ఐటి కంపనీలకు…., గచ్చిబౌలి జంక్షన్ లో వరకు ఉన్నా ఐటి కంపనీల ఉద్యోగులకు మరింత సౌకర్యవంతంగా ఉండనుంది. ఈ కిలోమీటర్ మార్గం అందుబాటులోకి వచ్చిన తరువాత కారిడార్ త్రీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. ఇక కారిడార్ టూ జెబిఎస్ నుండి సిబిఎస్ వరకు జనవరిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

జెబిఎస్ – ఫలక్ నూమా మార్గంలో ట్రయల్ రన్ ను ప్రారంభించారు మెట్రో అదికారులు. జెబిఎస్ నుండి సిబిఎస్ వరకు పదకోండు కిలో మీటర్ల మార్గంలో 9స్టాపులు అందుబాటులోకి వస్తాయి. కమీషనర్ ఆప్ మెట్రోరైల్ సేఫ్టి నుండి అనుమతులు వచ్చిన తరువాత కమర్షియల్ రన్ ను ప్రారంభిస్తారు. దాంతో హైదరాబాద్ మెట్రో ఫేజ్ వన్ పూర్తి అవుతుంది.

​ఇక ఇప్పటి వరకు మెట్రో మూడు కారిడార్లలో రెండు కారిడార్లులో నాగోల్ నుండి హైటెక్ సిటి…, మియాపూర్ నుండి ఎల్ బి నగర్ మార్గాల్లో 56కిలో మీటర్ల మెట్రో పరుగులు పెడుతుంది. ఆర్టిసి సమ్మెకారణంగా 3లక్షల 70 వేల నుండి 4లక్షల వరకు ప్రయాణికులు ప్రతి రోజు మెట్రో ను ఆశ్రయిస్తున్నారు. కారిడార్ త్రీ నాగోల్ నుండి హైటెక్ సిటి వరకు ఉన్న మార్గాన్ని మరో ఒకటిన్నర కిలో మీటర్ పెంచి మైండ్ స్పెస్ జంక్షన్ వరకు పోడిస్తున్నారు ఈ నెల 29 ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తుంది దాంతో యాబైఎడున్నర కిలో మీటర్ల మెట్రో సిద్దమైనట్లు అవుతుంది.

​ఇప్పుడు మిగిలిపోయిన కారిడార్ టూ జెబిఎస్ – ఫలక్ నూమా మార్గంలో జెబిఎస్ – సిబిఎస్ వరకు 11కిలో మీటర్ల మార్గంలో ట్రాక్ రెడి అయ్యింది కోద్ది రోజుల క్రితం ఎలక్ట్రికల్ వ్యస్థను సిద్దం చేయ్యడంతో ట్రయల్ రన్ ను ప్రారంభించారు అధికారులు. ఈ మార్గంలోని పెరెడ్ గ్రౌండ్.., సికింద్రాబాద్ వెస్ట్.., గాందీ ఆసుపత్రి.., ముషిరాబాద్ ఎక్స్ రోడ్…, ఆర్టిసి ఎక్స్ రోడ్స్…, చిక్కడ పల్లి.., నారాయణ గుడా…, సుల్తాన్ బజార్.., ఎంజీబిఎస్ వంటి 9స్టేషన్లు ఉన్నాయి. ఈ మార్గంలో రోడ్డు వెంబడి వెళ్తే ట్రాఫిక్ ఇబ్బందులతో 45నిముషాల టైం పడుతుంది. అయితే మెట్రో ట్రైన్ ద్వారా 16నిముషాల్లోనే 11కిలో మీటర్ల గమ్యస్థానాన్ని చెరుకోవచ్చంటున్నారు అధికారులు.

​ఇక మెట్రో ప‌ట్టాలెక్కాలంటే 18 రకాల పరీక్షలు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రదానంగా సిగ్నలింగ్ వ్యవస్థ.., మరియు ట్రైన్ సపరేషన్ టెస్ట్…, సిగ్నలింగ్ ద్వారా., ట్రైన్ కంట్రోల్ ద్వారా బ్రెక్ టెస్ట్…, ఒవర్ హెడ్ ఎలక్ట్రికల్ మెట్రో కోచ్ లకు కరెంట్ కలెక్షన్ టెస్ట్.., ప్యాసెంజర్ అనౌన్స్ మెంట్.., మరియు డిస్ ప్లే టెస్ట్.., డమ్మీ ప్యాసెంజర్ టెస్ట్ లు నిర్వహిస్తారు. ప్రయాణించే సమయంలో మెట్రోరైలులోని వేర్వేరు కీలక వ్యవస్థల పనితీరును ఇందులో పరీక్షిస్తారు. ముఖ్యంగా ప్రొపల్షన్‌ సిస్టమ్‌, అత్యవసర బ్రేకింగ్‌ వ్యవస్థ, శబ్ధం, కదలికలు, ఎలక్ట్రో మాగ్నటిక్‌ కాంపాటబిలిటీ, ట్రెయిన్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సిస్టమ్‌, ఈవెంట్‌ రికార్డర్‌, ప్యాసింజర్‌ అడ్రెసింగ్‌, లైటింగ్‌, డోర్స్‌ టెస్ట్‌, ఎయిర్‌కండిషనింగ్‌, అత్యవసర వేళల్లో రెస్క్యూ ఆపరేషన్‌ వంటి అంశాలను వయడక్డ్‌పై తిరిగే రైళ్లలో పరీక్షిస్తారు. అతి ముఖ్యమైన ఇతర వ్యవస్థలు సిగ్నలింగ్‌, ట్రెయిన్‌ కంట్రోలింగ్‌, కమ్యూనికేషన్‌, విద్యుత్తు వ్యవస్థ పనితీరును పరీక్షిస్తారు. ప్రయాణికుల స్థానంలో మెట్రోలో చదరపు మీటర్‌ వైశాల్యంలో 8మంది ప్రయాణికులకు బరువుకు సరిపడే ఇసుక బస్తాలు వేసి పనితీరును అంచనా వేస్తారు. ప్రయాణికులు ఉన్న సమయంలో ఎలా వెళుతుందో ప్రయాణికులు లేకుండానే నిర్దేశించిన వేళల్లో గంటల పాటూ ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తారు. దీన్నే బర్నింగ్‌ పీరియడ్‌ అంటారు. ఆ సమయంలో టెస్ట్‌రన్‌లోని పరీక్షలతో పాటూ నిర్వాహణ, భద్రతా పరీక్షిస్తారు. దినిని మెట్రో పరిభాషలో ర్యాప్స్‌ అంటారు.

​ఇక ఈ పరిక్షల సారాంశాన్ని ఎప్పటి కప్పుడు కెనాడా సంస్థ థాలీస్ సంస్థకు అందజేస్తారు. దాంతో అన్ని పరిస్థితులను స్టడి చేసి వారు సర్టిఫై చేస్తారు. తరువాత ఇంటర్నల్ సెఫ్టి ఎస్ ఎస్ ఆర్ నుండి సెప్టి సర్టిఫికెట్ ఇస్తారు . ఇలాంటి అన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం మెట్రో రైల్ సేప్టి కమీషన్ కు సమర్పించి అక్కడి నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే మెట్రోను ప్రజలందరికి అందుబాటులోకి తీసుకువస్తామని అంటున్నార అధికారులు.

- Advertisement -