‘మహర్షి’నుండి మైండ్‌బ్లోయింగ్‌ పిక్..

320
mahesh babu
- Advertisement -

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా ‘మహర్షి’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను, మే 9వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ‘మహర్షి’నుండి పాటలను ఒకొక్కటిగా విడుదల చేయనున్నారు చిత్ర బృందం. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూ ఆసక్తికరమైన పోస్టర్‌ను పంచుకున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అల్లరి నరేశ్‌, పూజా హెగ్డే, మహేశ్‌ కలిసి కాలేజ్‌కి వెళుతున్నట్లుగా పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. అందులోనూ సినిమాకు సంబంధించి వీరి ముగ్గురికి సంబంధించిన పూర్తి లుక్‌ను విడుదల చేయడం ఇదే తొలిసారి.

శుక్రవారం ఉదయం 9.09 గంటలకు ‘మహర్షి’ మ్యూజికల్‌ జర్నీ ప్రారంభం కాబోతోంది. సినిమాలోని ‘చోటీ చోటీ బాతే’అనే తొలి పాటను 29న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. మరి మహేశ్ 25వ చిత్రంగా వస్తున్న ఈ మూవీ ఏ రెంజ్‌ హిట్ అందుకుంటుందో చూడాలి.

- Advertisement -