టీఆర్ఎస్‌కు మజ్లిస్ మద్దతు

246
MIM Supports TRS for RS Elections
- Advertisement -

తెలంగాణలో జరగనున్న మూడు రాజ్యసభ స్ధానాల ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతివ్వాలని ఎంఐఎం నిర్ణయించింది. ఆ పార్టీ అధ్యక్షుడు,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ…టీఆర్ఎస్‌కు మద్దతిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్‌ బలం మరింతగా పెరిగింది. ప్రస్తుతం టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 90 కాగా ఎంఐపీఎం(7 ఎమ్మెల్యే)ల మద్దతుతో 97కి పెరిగింది. రేపు తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 1గంటలకు జరిగే టీఆర్ఎస్‌ఎల్పీ భేటీలో రాజ్యసభ అభ్యర్ధులను ఖరారు చేయనున్నట్లు సమాచారం.

ఈనెల 23న ఎన్నికలు రాజ్యసభ ఎన్నికలు జరుగనుండగా, 12వరకు నామినేషన్ల పరిశీలన,15న ఉపసంహరణకు అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బరిలో ఉన్నట్లు ప్రకటించిన ఆ పార్టీ గెలిచే అవకాశమే లేదు.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 21మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో ఏడుగురు పార్టీ మారగా ఇద్దరు అనారోగ్యంతో మరణించారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్‌కు మిగిలింది 12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. దీంతో చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్ధిని బరిలోకి దింపకపోవచ్చు.

- Advertisement -