అక్కినేని అఖిల్ ‘అఖిల్: ది పవర్ ఆఫ్ జువా’ అంటూ అరంగేట్రం చేశాడు కానీ ఆ సినమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక అఖిల్ రెండవ సినిమా ‘హలో’. ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. కాకపోతే ఈ సినిమాలో అఖిల్ మరింత హ్యాండ్సమ్ గా కనిపించాడనీ .. నటన పరంగా కొంత పరిణతిని కనబరిచాడని చెప్పుకున్నారు. ఈ మూవీకి ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశారు.. సినిమా కూడా మంచి టాకే తెచ్చుకుంది కానీ కలెక్షన్ల పరంగా వచ్చింది ఏమి లేదు.

ఈ నేపథ్యంలో అఖిల్ తదుపరి సినిమా కోసం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.అయితే అఖిల్ తాజాగా ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరితో ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన వినిపించిన కథకు నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెప్పుకున్నారు.
అయితే కొరటాల శివతో చేసే ఛాన్స్ కూడా ఉందనే టాక్ వచ్చింది. ఈ క్రమంలో అఖిల్ ఎవరితో చేస్తాడా అనే సందిగ్ధం ఏర్పడింది. తన తదుపరి సినిమాకి దర్శకుడిగా ఆయన వెంకీ అట్లూరినే ఎంపిక చేసుకున్నాడనేది తాజా సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

