విజయవాడ బరిలో ఎంఐఎం..

161
mim
- Advertisement -

ఏపీ ఎన్నికల బరిలో నిలవనుంది ఎంఐఎం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రెండు డివిజన్లలో ఎంఐఎం పోటీ చేయాలని నిర్ణయించింది. ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే హుసేన్‌ ప్రచారం చేశారు. 64 స్థానాల్లోని 2 స్థానాల్లో.. ఎంఐఎం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

ఇప్పటివరకు మజ్లిస్‌కు ఓల్డ్ సిటీకి చెందిన పార్టీ అనే పేరుంది. కానీ క్రమంగా ఎంఐఎంను దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో పోటీ చేస్తూ సత్తాచాటుతూ వస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థుల తరపున ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం కూడా నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా తాజాగా బెజవాడ రాజకీయాల్లోకి ఎంఐఎం ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -