గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన గంగవ్వ..

196
Gangavva
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆకర్షించి కొత్త పుంతలు తొక్కుతు ముందుకు కొనసాగుతుంది. తాజాగా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబడిపెళ్లి తన గ్రామంలోని పకృతి వనంలో మొక్కలు నాటారు మై విలేజ్ షో, బిగ్ బాస్ సీజ‌న్ 4 భాగస్వామురాలు గంగవ్వ.

ఈ సందర్భంగా గంగవ్వ మాట్లాడుతూ.. గౌరవ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజలో భాగంగా తాను ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కను నాటనన్నారు. మొక్కలను నాటడంతో వాతావరణం లో సమతుల్యత ఏర్పడుతుందన్నారు. వాతావరణ కాలుష్యం తగ్గాలంటే ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇక జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబడిపెళ్లి గ్రామంలో నివసిస్తున్న గంగ‌వ్వ మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్‌తో ఫేమ‌స్ అయింది. ఇటీవల బిగ్ బాస్ సీజ‌న్ 4 లోను పార్టిసిపేట్ చేసి కొన్ని రోజులు సంద‌డి చేసిన ఈ అవ్వ అనారోగ్యంతో నిష్క్రమించింది.

- Advertisement -