త్వరలో నూతన జీహెచ్ఎసీ చట్టం- కేటీఆర్‌

178
ktr
- Advertisement -

పట్టణాల్లో భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు కొత్తగా రూపొందించిన టీఎస్‌-బీపాస్‌ ను సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణాలు పెరుగుతున్న మేరకు క్రమబద్ధీకరణ, ప్రణాళికాబద్ధ అభివృద్ధి జరగకపోవడంతో మొన్న వచ్చిన వరదల వంటివి పదేపదే వస్తున్నాయి. అందుకే నూతన జీహెచ్ఎంసి చట్టంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం కొన్ని కఠినమైన నిబంధనలను చేర్చబోతున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే కొత్తగా మున్సిపల్, పంచాయతీ రాజ్, రెవెన్యూ వంటి చట్టాలు తీసుకువచ్చాం… త్వరలో నూతన జీహెచ్ఎసీ చట్టాన్ని తీసుకురాబోతున్నామన్నారు.

టీడీఅర్ బ్యాంక్ ఏర్పాటు, ఏకీకృత సర్వీస్ రూల్స్ వంటివి తీసుకువచ్చాము. ఇవన్నీ ప్రజలందరికీ మెరుగైన పౌర సేవలు అందించడం కోసమే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్-బీపాస్ విధానం దేశంలోనే అత్యుత్తమ భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియగా నిలువబోతున్నది. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నగరానికి ఉన్నంత ఉజ్వల భవిష్యత్తు ఏ ఇతర మెట్రో నగరానికి కూడా లేదని మంత్రి అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరానికి అందుబాటు ధరల్లో ఇండ్లు ఉన్నాయి అన్న ఒక సానుకూలత హైదరాబాద్ నగరానికి ఉన్నది, ఈ సానుకూలతను అలాగే కొనసాగించాలని రియల్ ఎస్టేట్ సంస్థలకు విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్.

- Advertisement -