వాడిపోయిన పువ్వు మళ్లీ వికసించినట్లు.. ప్రస్తుతం ఫేడ్ హీరోయిన్ సంగీత మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. మసూద అనే చిన్న సినిమా ఇచ్చిన జోష్ లో ఆమెకు వరుస సినిమాలు వస్తున్నాయి. సర్కారు వారి పాట తర్వాత మళ్ళీ సంగీతకు సరైన ఛాన్స్ పడలేదు. నిజానికి ఆమె దగ్గరకు కథలు అయితే బాగానే వెళ్లాయి. కానీ, వాటిల్లో ఆమె పాత్రకు సరైన ప్రాధాన్యత ఉండటం లేదు. దాంతో ఆమె సినిమాలు చేసినా.. చెప్పుకోతగ్గ పాత్ర చేయలేక పోయింది. ఇక విసిగి వేసారి పోయి తెలుగు సినిమాలు తగ్గించేసింది. పైగా ఆ మధ్య తమిళ సీరియల్ కి కూడా కమిట్ అయ్యిందని వార్తలు వచ్చాయి.
ఇలాంటి పరిస్థితుల్లోనే సంగీత తలుపు తట్టారు దర్శకుడు సాయికిరణ్, నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. కలిసి వచ్చిన అదృష్టాన్ని ఒడిసి పట్టుకోవడంలో ఇరవై ఏళ్ల అనుభవం అయ్యే. ఆ అనుభవంతో సంగీత తన నటనా దాహాన్ని తీర్చుకోవడానికి మసూద ని బాగా ఉపయోగించుకుంది. సినిమాలో చేసింది సైడ్ క్యారెక్టర్ అయినా.. ముఖ్యమైన క్యారెక్టర్. దాంతో ఒక్కసారిగా సంగీతకు డబుల్ క్రేజ్ వచ్చింది. నిజానికి ఒకప్పుడు సంగీత కి ఫుల్ క్రేజ్ ఉండేది.
కానీ, హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయ్యాక నేటి తరానికి ఆమెకు మధ్య గ్యాప్ వచ్చింది. ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో సంగీత పేరు మరోసారి మార్మోగుతోంది. డిజిటల్ పీపుల్ కి కూడా సంగీత చేరువైంది. ముఖ్యంగా మసూద పుణ్యమా అని ఆమె పై సోలో సినిమాలు చేయడానికి కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తమ్మీద రాలిపోయి ఎండిపోయాక, చిగురు మెలిచినట్టు… తన కెరీర్ కి మళ్ళీ ఊపు రావడంతో సంగీత ఫుల్ హ్యాపీగా ఉంది.
ఇవి కూడా చదవండి…