మీ జీవితం ఓ సంబరం.. లవ్ యూ నాన్న – మహేష్ బాబు

108
- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ హఠాన్మరణం మహేష్ కి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కృష్ణ గారు ఇక లేరు అని తెలిసి కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు, అభిమానులు కూడా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఐతే, కాలం ఏ గాయాన్ని అయినా మరపించగలదు. ఇప్పుడిప్పుడే మహేష్ ఆ దురదృష్టకరమైన సంఘటన నుండి బయట పడుతున్నాడు. అయితే.. తాజాగా మహేష్ తన సోషల్ మీడియా వేదికగా తన తండ్రి కృష్ణ గారి గురించి రాస్తూ ఓ ఎమోషనల్ మెసేజ్ ను పోస్ట్ చేశారు. ఇంతకీ మహేష్ ఆ పోస్ట్ లో ఏం చెప్పాడో.. మహేష్ పదాల్లోనే విందాం.

“మీ ఇన్నేళ్ల జీవితం మాకు ఓ సంబరం. అదే విధంగా మీ ముగింపు కూడా ఓ గొప్ప అంతిమ ప్రయాణమే. మీరు మీ జీవితంలో ఎంతో నిర్భయంగా జీవించారు. మీ జీవితాన్ని ఎంతో డేరింగ్ అండ్ డాషింగ్ తో ముందుకు తీసుకువెళ్లారు. మీరే నాకు ఇన్ స్పిరేషన్, మీరే నాకు ధైర్యం. ఇప్పుడు నాలో నేను కొత్తగా ఉన్నట్టు అనిపిస్తోంది. నన్ను నేను చూసుకుంటున్నాను. మీరు నాతో లేకపోయినా సరే.. మీరు ఇచ్చిన కాంతి ఇంకా నాలో ప్రకాశిస్తుంది. మీ లెగసిని నేను ముందుకు తీసుకెళ్తాను. లవ్ యూ నాన్న. మై సూపర్ స్టార్” అంటూ మహేష్ బాబు ఎంతో భావోద్వేగంతో ఈ లెటర్ రాశారు.

మహేష్ ఈ ఎమోషనల్ పోస్ట్ తో పాటు కృష్ణ గారి యంగ్ ఏజ్ లో ఉన్న ఓ మెమొరబుల్ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఈ ఫోటో కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక కృష్ణ మెమోరియల్ ని ఆయన కుటుంబం నిర్మించనున్నారని వార్త బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మెమోరియల్ లో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 మూవీస్ ఫొటోస్ మరియు షీల్డ్స్ ని పెట్టబోతున్నారట.

ఇవి కూడా చదవండి…

అల్లరోడికి రిస్క్ ఎక్కువే !

మన బాస్ మళ్ళీ తన జోన్ లోకి వచ్చేశారు – చరణ్

పాపం జాన్వీ కపూర్.. ఇక పరిస్థితి మారదా ?

- Advertisement -