తమిళ నెంబర్ వన్ హీరో.. మరో తెలుగు సినిమా !

101
- Advertisement -

తమిళ హీరోలు తెలుగు సినిమాల మార్కెట్ పై, తెలుగు హీరోలు తమిళ సినిమాల మార్కెట్ పై పట్టు పెంచుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు, నిజానికి మొదటి తరం నటీనటుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ రోజుల్లో పలు తమిళ చిత్రాల్లో ఏఎన్నార్ సక్సెస్ అయ్యారు. అలాగే సీనియర్ ఎన్టీఆర్ సినిమాల కోసం అప్పటి తమిళ ప్రేక్షకులు బాగా ఎదురుచూసేవారు. తెలుగు – తమిళ చిత్రాలకు అంత మంచి అనుబంధం ఉంది. అయితే, ఈ మధ్య త‌మిళ స్టార్ హీరోలంతా తెలుగు మార్కెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

తమిళ యంగ్ సూపర్ స్టార్ విజయ్ ఇప్పుడు తెలుగు ప‌రిశ్ర‌మ‌పై ఫోక‌స్ చేశాడు. ఇప్ప‌టికే `వారసుడు` అనే సినిమా చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి ద‌ర్శ‌కుడు. నిజానికి ఈ సినిమా కంటే ముందే…క్రిష్ చెప్పిన క‌థ విజయ్ కి నచ్చింది. కానీ ఎందుకో అప్పట్లో ఆ సినిమా సెట్ కాలేదు. మొత్తానికి దిల్ రాజు ప్రమేయంతో 2023 సంక్రాంతికి వారసుడు చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు విజయ్. తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది. కాబట్టి ఓపెనింగ్స్ కి ఢోకా లేదు. ఎప్పటి నుంచో తెలుగు మార్కెట్ కోసం ఆశ పడుతున్న విజయ్ కి, ఈ సినిమా ఆ ఆశను తీర్చనుంది.

అందుకే, విజయ్ మరో తెలుగు సినిమా పై ఫోకస్ పెట్టాడు. విజయ్ కోసం మ‌రో ప్రాజెక్ట్ సెట్ అయ్యేలా ఉంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన క‌థతో విజయ్ ను ఆక‌ట్టుకొన్నాడట. ఆ మధ్య నారప్ప తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు శ్రీకాంత్ అడ్డాల. నారప్ప సినిమా విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు పొందింది. ద‌ర్శ‌కుడుగా శ్రీకాంత్ అడ్డాల మంచి మార్కులు వేయించుకొన్నాడు. పైగా దిల్ రాజుతో శ్రీకాంత్ కు మంచి అనుబంధం ఉంది. దిల్ రాజు సాయంతోనే విజయ్ కు కథ చెప్పాడట. అతి త్వ‌ర‌లో ఈ కాంబోపై ఓ క్లారిటీ వ‌స్తుంది.

ఇవి కూడా చదవండి…

ఫేడ్ అవుట్ భామకు ఫుల్ క్రేజ్.. సోలోగా ఛాన్స్ లు !

బన్నీతో పవన్ డైరెక్టర్.. ఈ సారైనా కుదురుతుందా?

బాలయ్యతో ‘ఖిలాడీ’ భామ.. హాట్ హాట్ గా..!

- Advertisement -