మైక్రోసాఫ్ట్.. పౌల్ అలెన్ మృతి

253
paul
- Advertisement -

మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు పౌల్ అలెన్ (65) కన్నుమూశారు. కొన్నిసంవత్సరాలుగా లింఫోమా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. నాన్-హడ్జ్‌కిన్ లింఫోమాకి చికిత్స తీసుకుంటున్నట్టు ప్రకటించిన రెండు వారాలకే అలెన్ మరణించారు.

1975లో బిల్ గేట్స్, పౌల్ అలెన్‌ కలిసి మైక్రోస్టాఫ్ సంస్థను స్థాపించారు. వీరిద్దరూ స్కూల్ ఫ్రెండ్స్. 1983లో కేన్సర్ సోకడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. బాల్యమిత్రుణ్ని కోల్పోవడం పట్ల బిల్ గేట్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్ననాటి స్నేహితుడిని కోల్పోవడంతో హృదయం ముక్కలైందన్నారు. పౌల్ లేకుండా పర్సనల్ కంప్యూటింగ్ లేదని గేట్స్ తెలిపారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కొనియాడారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని సత్య తెలిపారు.

Image result for bill gates paul

1983లో ఆయన పోర్ట్‌ల్యాండ్ ట్రయల్ బ్లేజర్స్ అనే బాస్కెట్ బాల్ టీంను ఆయన కొనుగోలు చేశారు.1986లో సోదరి జోడీ అలెన్‌తో కలిసి వుల్కన్ సంస్థను స్థాపించారు. పర్యావరణ, సమాజ హిత కార్యక్రమాల కోసం 2 బిలియన్ డాలర్లను ఆయన విరాళంగా ఇచ్చారు. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ఆయన 44వ స్థానంలో ఉన్నారు.

- Advertisement -