ప్రేమలో పడ్డ బిల్‌గేట్స్‌…

25
- Advertisement -

మైక్రోస్టాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ మరోసారి ప్రేమలో పడ్డారు. ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ మాజీ సీఈవో మార్క్‌ హర్డ్‌ భార్య అయిన పౌలా హర్డ్‌తో గత కొంత కాలంగా ప్రేమాయాణం కొనసాగిస్తున్నారని బిల్‌ సన్నిహితులు తెలిపారు. గత నెలలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ సందర్భంగా వీరిద్దరూ ఎంచక్కా చెట్టాపట్టలు వేసుకొని తిరిగినట్టు ప్రముఖ అంతర్జాతీయ మీడియా కోడై కూసింది.

2021లో మెలిందాతో బిల్‌ గేట్స్‌ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదంతా ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసమే విడాకులు తీసుకున్నారంటూ ప్రచారం జరిగింది. అన్నట్టు మెలిందా కూడా మాజీ టీవీ రిపోర్టర్ జాన్ డ్యూ ప్రీ తో డేటింగ్‌ చేస్తున్నట్టు ఆన్‌లైన్‌ టాబ్లాయిడ్‌లో కథనం వెలువడింది.

ఇవి కూడా చదవండి…

రాహుల్‌ వ్యాఖ్యలను తోసిపుచ్చిన జీవీకే…

15వేలు దాటిన మృతుల సంఖ్య

నేటి బంగారం,వెండి ధరలివే

- Advertisement -