కష్టపడి పనిచేస్తేనే పదవులు..

78
mettu
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్(RDC) చైర్మన్ గా శ్రీ మెట్టు శ్రీనివాస్ ఎర్రమంజిల్ లోని రోడ్లు-భవనాలు శాఖ కార్యాలయంలోని తన ఛాంబర్ లో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఎన్సీలు గణపతి రెడ్డి,రవీందర్ రావు, పలువురు అధికారులు, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి. ప్రకాశ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, తాత మధు, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి,అరూరు రమేశ్, స్త్రీ సాధికార సంస్థ చైర్ పర్సన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎడమ కృష్ణా రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, గాయత్రి రవి,కొండ దేవయ్య తదితరులు హాజరయ్యి మెట్టు శ్రీనివాస్ కి శుభాకంక్షలు తెలియచేసి, అభినందించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెట్టు శ్రీనివాస్ ను మొదటగా తనకు పరిచయం చేసారని, నిబద్ధతతో పనిచేసే వ్యక్తి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పార్టీ ఆదేశిస్తే వంద శాతం లక్ష్యాన్ని సాదించేందుకు కష్టపడి పనిచేసే వ్యక్తి అని కొనియాడారు.పార్టీ ఆదేశానుసారం పనిచేసే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో గుర్తింపు లభిస్తుందని అన్నారు.దానికి మెట్టు శ్రీనివాస్ ఉదాహరణ అన్నారు.తనకు సన్నిహితుడైన వ్యక్తినే తను నిర్వర్తించే శాఖకు చైర్మన్ కావడం సంతోషకరం అన్నారు.నూతన బాధ్యతల్లో ఆయన మంచి గుర్తింపు సాధిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.మెట్టు శ్రీనివాస్ కు చైర్మన్ గా అవకాశం కల్పించిన అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

5 ఏండ్ల కింద 10 వేల మందితో టీఆరెఎస్ లోకి మెట్టు శ్రీనివాస్ వచ్చారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.సందర్భాలను సమయాలను బట్టి
అందరికీ అవకాశాలు వస్తాయి.రాజకీయాల్లో ఓపిక అవసరం అన్నారు. ములుగులో బాగా పని చేశారు ,మంచి పని మంతుడన్నారు. లక్ష్యం ఏమైనా వంద శాతం సాధించే గుణం ఉన్నవాడు,కష్టపడి పనిచేసేవాడని మెట్టు శ్రీనివాస్ అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అవకాశం కల్పించిన కెసిఆర్, కేటీఆర్ లకు ధన్యవాదాలు తెలిపారు.పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో, అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మందికి కెసిఆర్ గారు అవకాశాలు ఇచ్చారు. ఇస్తున్నారన్నారు.ఏ పని అప్పగించిన అత్యంత క్రమశిక్షణ తో మెట్టు శ్రీనివాస్ పని చేశారని కొనియాడారు.టిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే ఇలాంటి చాలా మందికి ఇంకా అవకాశాలు దక్కాల్సి ఉందని,సీఎం కెసిఆర్,కేటిఆర్ తప్పకుండా అవకాశాలు కల్పిస్తారని పలువురు ఎమ్మెల్యేలు, ఛైర్మన్ లు అన్నారు.

బీజేపీ వైఖరిని ఎండగడుతూ, రేపటి నుండి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేయాల్సి ఉందని అందరూ వారి వారి స్థాయిల్లో కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రులు వేముల,ఎర్రబెల్లి, సత్యవతి ,రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతలకు వంద శాతం న్యాయం చేస్తానని చైర్మన్ మెట్టు శ్రీనివాస్ అన్నారు.మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో, సూచనలతో రోడ్ల అభివృద్ధి కి కృషి చేస్తానని అన్నారు. తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్,వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు,అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -