29 నుంచి అందుబాటులోకి మెట్రో..

221
Metro Rail PM to launch
- Advertisement -

హైదరాబాద్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో కలసాకారమైందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నవంబర్ 28న మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. మంత్రులు తలసాని, కేటీఆర్, పద్మారావు, మహేందర్ రెడ్డిలతో కలిసి మెట్రోలో ప్రయాణించిన కేటీఆర్ అనంతరం మెట్రో స్మార్డ్ కార్డులను విడుదల చేశారు. 29 నుంచి ప్రజలకు మెట్రో అందుబాటులో ఉండనుందన్నారు. తొలుత ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజలకు మెట్రో అందుబాటులో ఉండబోతోందని తెలిపారు. భవిష్యత్‌లో వచ్చే ఫీడ్ బ్యాక్‌నిబట్టి సమయవేళల్లో మార్పులు చేస్తామన్నారు.

పబ్లిక్,ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటైన హైదరాబాద్ మెట్రో ప్రపంచంలోనే పెద్దదని తెలిపారు. మెట్రో కోసం 57 రైళ్లు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. ప్రతి ట్రైన్‌కు 3 కోచ్‌లు ఉంటాయని ఒక్కో కోచ్‌లో 350 మంది ప్రయాణించవచ్చన్నారు. భవిష్యత్‌లో మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్యను బట్టి కోచ్‌లను పెంచుతామని తెలిపారు. మెట్రో టికెట్ ధరలను ఎల్ అండ్ టీ నిర్ణయిస్తుందని తెలిపారు.

ktr metro

తొలిదశలో 24 స్టేషన్లు ప్రారంభంకానున్నాయని కేటీఆర్ చెప్పారు. మెట్రో స్టేషన్ల నుంచి కాలనీలకు బస్సులు నడిచేవిధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాత్రింభవళ్లు కష్టపడి పనిచేయడం వల్లే మెట్రో పనులు పూర్తయ్యాయన్నారు.మెట్రోను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మెట్రో స్టేషన్లలో స్కై వాక్స్‌ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

పార్కింగ్ స్ధలాలకు సంబంధించి వివరాలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.అన్నిరకాల హంగులతో మెట్రో ప్రారంభానికి సిద్దమైందని తెలిపారు. టి సవారి పేరుతో మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.

- Advertisement -