‘అదిరింది’ అందుకే ఆగింది..!

200
Mersal Telugu release delayed over GST dialogue
- Advertisement -

మెర్సల్‌ మూవీ గత వారం తమిళంలో విడుదలై ఇటు కలెక్షన్ల పరంగా, అటు వివాదాల పరంగా సంచలనం సృష్టించిన ‘మెర్సల్’ తెలుగు వర్షన్ ‘అదిరింది’ నేడు కూడా విడుదల కాలేదు. ఈ సినిమా ఈ నెల 27న విడుదల అవుతుందని రెండు రోజుల క్రితమే పబ్లిసిటీ ఇచ్చిన నిర్మాతలు, ఆన్ లైన్లో టికెట్లు బుకింగ్ కూడా చేసేశారు. కానీ ఈ ఉదయం థియేటర్ వద్దకు వెళ్లిన ప్రేక్షకులకు చిత్రం విడుదల మరోసారి వాయిదా పడిందన్న కబురు వినిపించింది. దీంతో పలువురు సినీ ప్రేక్షకులు థియేటర్ల వద్ద నిరసనలకు దిగారు.

Mersal’s Telugu version Adhirindhi postponed

కాగా, ఈ చిత్రంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న డైలాగులను తొలగించాలని సెన్సార్ బోర్డు సభ్యులు కోరగా, ఓ భాషలో అవే డైలాగులకు ఓకే చెప్పిన తరువాత, మరో భాషలో డైలాగులు తీసేయమని ఎలా చెబుతారని అడుగుతూ, యూనిట్ అందుకు వ్యతిరేకించింది. ఈ వ్యవహారం కారణంగానే ‘అదిరింది’ నేటి విడుదల వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. త్వరలో సినిమా విడుదలకు సంబంధించిన మరో తేదీని ప్రకటిస్తామని చిత్ర నిర్మాత ప్రకటించారు.

ఈ చిత్రంలో వస్తు సేవల పన్నుకు వ్యతిరేకంగా డైలాగులు ఉండటంతో వాటిని తొలగించాలని బీజేపీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా తమిళంలో విడుదలైన ఈ మూవీ తొలివారంలో రూ.88కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి రికార్డు సృష్టించింది. బాహుబలి 2 రికార్డును సైతం బ్రేక్ చేసిన ఈ మూవీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చను రేపింది.

- Advertisement -