పవన్‌ సినిమాకు నిర్మతగా రాజు..

252
Dil Raju to produce film with Power Star
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్ సినిమాల నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు దిల్ రాజు.ఈయనకు పవర్ స్టార్ సినిమా అంటే చాలు.. అక్కడికి వెళ్ళిపోయి కొనేస్తాడు. ఆ విధంగా హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా పవన్ మీద తన అభిమానం చాటుకుంటూ ఉంటాడు. అయితే ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా అయినా నిర్మించి తీరాలనేదే రాజు కల. అయితే ఆ కలతీరే సమయం వచ్చిందనే చేప్పాలి.ఎందుకంటారా..! పవన్ ఇక ఒకటి రెండు సినిమాలు చేసి రాజకీయాలకి పూర్తి సమయాన్ని కేటాయించాలని అనుకుంటున్నాడు. ఎప్పటి నుంచో పవన్‌తో సినిమా చేయాలనుకుంటున్న దిల్ రాజు, ఇక తన కోరిక నెరవేరదేమోననే కంగారుతో పవన్ ను మీట్‌ అయ్యాడు. ఆయనతో సినిమా చేసే సమయం కోసం తాను చాలాకాలంగా ఎదురుచూస్తున్నాననే విషయం చెప్పాడట.

Dil Raju to produce film with Power Star

అయితే పవన్‌ మాత్రం దిల్ రాజు బ్యానర్లో చేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదంటూ సుముఖుతను వ్యక్తం చేశాడని సమాచారం. తనకి మంచి కథ కావాలనీ .. మంచి కథను సిద్ధం చేసుకుని రమ్మని పవన్ అన్నాడని దిల్‌ రాజు చెబుతున్నారు. ఇక ఆలస్యం చేయకూడదన్న దిల్ రాజు పవన్ ఇమేజ్ కి తగిన కథ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తుంది.

దిల్ రాజు ఏదైనా పనిని ప్రారంభించాడంటే .. అది పూర్తయ్యే వరకూ ఆయన శ్రమిస్తూనే ఉంటాడు. అలాగే నిర్మాతగా పవన్ సినిమాను పట్టాలెక్కించే వరకూ ఆయన నిద్రపోడని ఫిల్మ్ నగర్‌లో చెప్పుకుంటున్నారు. నిజానికి మెగా క్యాంపులో దాదాపు అందరి హీరోలతోనూ దిల్ రాజుకు సత్సంబంధాలున్నాయి. అందుకే మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన ప్రొడక్షన్‌లో సినిమా ఒకటి చేస్తానని ఎప్పుడో చెప్పారు. ఇక మిగిలిన స్టార్లందరూ దాదాపు చేసేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమా చేయడం ఇదే మొదటిసారి. ఈవిషయాన్ని నిర్మాత దిల్ రాజు సోమవారం మీడియాకు చెప్పారు.

- Advertisement -