విక్రమ్ ఆర్ట్స్ సమర్పించు విఖ్యాత హరితవనం” మేము పక్కా లోకల్” దద్దరిల్లే జానపదం అనే క్యాప్షన్ తో 45 మంది బుల్లితెర కళాకారులతో మొట్ట మొదటిసారిగా జానపద ఆట పాటల కార్యక్రమాన్ని జి.శ్రీనివాస్ రెడ్డి నిర్మాతగా విక్రమ్ ఆదిత్య రెడ్డి నిర్మాణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మేము పక్కా లోకల్ అనే పోస్టర్ ను ఎమ్ ఎల్ ఎ. రసమయి బాలకిషన్ చే ఆవిష్కరించారు.
అనంతరం రసమయి మాట్లాడుతూ.. కళాకారులను ప్రోత్సహించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విక్రమ్ ఆదిత్యను, నిర్మాత జి.శ్రీధర్ రెడ్డిని అభినందిస్తున్నా.. మేము లోకల్ అని చెప్పుకోవడానికి 50 సంవత్సరాలు పట్టింది. తెలంగాణ కళాకారులను నిలబెట్టడానికి గతంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాము. జాన పదం అంటే శ్రమలో నుంచి పుట్టిన పదంమే జానపదం. కలిపించి వ్రాసే పాటకాదు జానపదం అంటే. పాటకు అడుగులు కలిపే ఈ మంచి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మన అందరిలో ఉందని కోరుతున్నా… అన్నారు.
నిర్వాహకుడు విక్రమ్ ఆదిత్య మాట్లాడుతూ.. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన రసమయి బాలకిషన్‌కి నా కృతజ్ఞతలు. మరుగునపడుతున్న జానపద పాటలను మళ్లీ వెలుగులోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ కాన్సెప్ట్. అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా…అన్నారు.
నిర్మాత శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. మంచి కార్యక్రమాన్ని తలపెట్టాము. జానపదాలు బ్రతకాలనే ఉద్దేశ్యం తో చేస్తున్న కార్యక్రమాన్ని ఆదరించాలని కోరుతున్నా అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టివి నటి జ్యోతి రెడ్డి, అనూష, శ్రీవాని, ప్రభాకర్ ( బతుకమ్మ దర్శకుడు) తదితరులు పాల్గొన్నారు.