నాని పోగొట్టుకుంది..చిరు ఇచ్చేశాడు

151
Megastar special gift for Chiranjeevi

హీరో నాని పోగొట్టుకున్న చిరంజీవి ఇచ్చేశారు. ఇంతకీ నాని పోగొట్టుకుంది ఏంటీ… చిరంజీవి ఇచ్చింది ఏంటీ అని ఆలోచిస్తున్నారా..అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఇటీవలె నాని మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటిశ్వరుడు షోకు వెళ్లాడు. ఈ సందర్భంగా నాని తనకు గతంలో ఎదురైన అనుభవాన్ని వివరించారు. చిరంజీవి ‘మాస్టర్’ సినిమాకు తాను సైకిల్ పై వెళ్లానని, టిక్కెట్ దొరికిన ఆనందంలో తన సైకిల్ పోయిన విషయాన్ని కూడా పట్టించుకోలేదని, దాని కోసం బాధ పడలేదని ఆ షోలో చెప్పాడు.

అయితే, ఆ షో లో గెలుచుకున్న డబ్బుతో ఓ కొత్త సైకిల్ కొనుక్కుంటానని నాని అనగా, అందుకు, చిరంజీవి అభ్యంతరం చెప్పారు. తన సినిమా చూసేందుకు వెళితే సైకిల్ పోయింది కనుక, మరో కొత్త సైకిల్ ను తానే కొనిస్తానని నాటి షో లో చిరంజీవి మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో నానికి కొత్త సైకిల్ ను ఆయన పంపారు. ఆ సైకిల్ పక్కనే నిలబడి ఫొటో దిగిన నాని, దానిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘ఆ అబ్బాయి సైకిల్ తిరిగి పొందాడు. షోలో ప్రామిస్ చేసినట్టుగా, చిరంజీవిగారు నాకు ఈ సూపర్ కూల్ సైకిల్ ను పంపారు’ అని నాని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఆ సైకిల్‌తో వెంటనే ఫొటో తీసుకున్న నాని, దాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు.