రకుల్ ప్రీత్ @ టీచ్‌ ఫర్ ఛేంజ్

204
Rakul at Teach For Change
- Advertisement -

ప్రభుత్వ పాఠశాలల్లో 8,9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లీష్‌తో పాటుగా నాయకత్వ లక్షణాలు మెరుగుపరిచే లక్ష్యంతో కృషిచేస్తున్న సంస్థ టీచ్ ఫర్ ఛేంజ్. ప్రతివారం మూడు గంటలపాటు తమ విలువైన కాలాన్ని మహోన్నత కార్యక్రమం కోసం వెచ్చిస్తున్నఅభిరుచి కలిగిన వాలెంటీర్లు ఇంగ్లీష్ బోధనను చేస్తున్నారు. టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థను నటి, నిర్మాత లక్ష్మీ మంచు మరియు యువ యాక్టివిస్ట్ చైతన్య ఎంఆర్ఎస్‌కె  2014వ సంవత్సరంలో ప్రారంభించారు.

Rakul at Teach For Change

ఈ కార్యక్రమంలో భాగంగా ఇంగ్లీష్ బోధన చేయాలనుకునే వాలెంటీర్లుకు వారి ఇంగ్లీష్ ప్రావీణ్యతను పరీక్షించడంతోపాటుగా వారినిబద్ధతను సైతం పరిశీలించి ఇంగ్లీష్ ప్రోగ్రామ్‌లో శిక్షణ అందించిన తరువాతనే వారిని విద్యార్థులకు క్లాస్ రూమ్‌లో బోధించడానికి అనుమతిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేరబోయే వాలెంటర్లు కచ్చితంగా ఒక అకడమిక్ సంవత్సరం పనిచేయాల్సి  ఉంటుంది.

Rakul at Teach For Change

టీచ్‌ఫర్ ఛేంజ్‌ కార్యక్రమాన్ని భారతదేశంలో ట్రో ఫెల్‌కు అధీకృత భాగస్వామి కాస్మోస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిజైన్ చేయడంతో పాటుగా అమలు చేయడంతో పాటుగా సమీక్షించి సర్టిఫై చేస్తుంది. మా కార్యక్రమం ద్వారా పతి విద్యార్ధినీ తమ విద్యాసంవత్సరం చివరలో టోఫెల్‌ ప్రైమరీ సర్టిఫికెట్‌తో సర్టిఫై చేస్తుంది.

టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ఇవాళ టీచ్ ఫర్ ఛేంజ్‌కు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించడంతో పాటుగా బంజారాహిల్స్‌లోని ప్రభుత్వోన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్ధులకు ఇంగ్లీష్‌ పాఠాలను బోధించారు. టీచ్ ఫర్ ఛేంజ్ కార్యక్రమం కింద నమోదు చేసుకున్న పాఠశాలల్లో బంజారాహిల్స్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఒకటి.  రకుల్ ప్రీత్ సింగ్ నేడు విద్యార్థులకు ఇంగ్లీష్‌లో వ్యతిరేక పదాలను గురించి ద్యార్థులకు వివరించడంతో పాటుగా విద్యార్థులకు ఇంగ్లీష్ స్పీకింగ్ యాక్టివిటీ నిర్వహించారు. టీచ్ ఫర్ ఛేంజ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో 25 పాఠశాలల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

- Advertisement -