బాబోయ్ మెగాస్టార్ రివ్యూ ఇచ్చేశారోచ్

21
- Advertisement -

బాబోయ్ మెగాస్టార్ చిరంజీవి ‘మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి’కి పెద్ద రివ్యూ ఇచ్చారు. నిజంగా మెగాస్టార్ లాంటి స్టార్ హీరో నుంచి ఒక చిన్న సినిమాకి ఇంత పెద్ద రివ్యూ రావడం నిజంగా విశేషమే. ఇంతకీ, మెగాస్టార్ ‘శెట్టి – పోలిశెట్టి’ల ప్రేమ కహానీల గురించి ఏం చెప్పారో చూద్దాం రండి. మెగాస్టార్ మాటల్లోనే.. ‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం. నాకు చాలా బాగా నచ్చింది అన్నట్టు మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

అలాగే, మెగాస్టార్ ఇంకా తన ట్వీట్ లో మాట్లాడుతూ.. ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్ గా వున్న మనందరి ‘దేవసేన’, అనూష్క శెట్టి లు ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ మహేష్ బాబుని అభినందించాల్సిందే. ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే.. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను’ అని చిరంజీవి తన ట్వీట్ లో చెప్పుకొచ్చాడు.

Also read:ప్రభాస్‌ – అనుష్క పెళ్లి..మళ్లీ రూమర్లు

పైగా మెగాస్టార్ మరో క్రేజీ కామెంట్స్ కూడా తన ట్వీట్ లో పోస్ట్ చేశాడు. ఇంతకీ ఆ కామెంట్స్ ఏమిటో తెలుసా ?, ‘మరోసారి థియేటర్ లో ప్రేక్షకులందరి తోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి 100% ఆడియన్స్ ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు’ అంటూ మెగాస్టార్ సాలిడ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. న‌వీన్ పోలిశెట్టి, అనుష్కశెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌స్తున్న సినిమా మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో మ‌హేష్ బాబు ద‌ర్శ‌కత్వంలో రూపొందిన‌ ఈ సినిమా రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

- Advertisement -