మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి..బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

21
- Advertisement -

యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించి రీసెంట్ గా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ మూవీకి ఆడియెన్స్ తో పాటు సెలబ్రిటీల అప్రిషియేషన్స్ దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ లో శనివారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో దర్శకులు మారుతి, నాగ్ అశ్విన్, అనుదీప్ కేవీ, నందినీ రెడ్డి, బుచ్చిబాబు, మేర్లపాక గాంధీ, ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్, ఎస్కేఎన్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ – నేను మిగతా వాళ్ల సినిమా ఫంక్షన్స్ కు గెస్ట్ గా వెళ్తుంటా కానీ నవీన్ సినిమాలకు మాత్రం ఒక ఫ్యాన్ గా వస్తుంటా. ఆయన పర్ ఫార్మెన్స్ అంటే నాకు అంత ఇష్టం. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చూశాను. బ్యూటిఫుల్ మూవీ. యూవీ క్రియేషన్స్ వాళ్లు ఒక సినిమాను నిర్మించే విధానం, ఆ ప్రాజెక్ట్ మీద వారికి ఉన్న డెడికేషన్ అద్భుతం. ఈ మూవీ టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.

డైరెక్టర్ మేర్లపాక గాంధీ మాట్లాడుతూ – ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ ఆకట్టుకుంది. నవీన్, అనుష్క నటనతో ఇంప్రెస్ చేశారు. కొన్ని సినిమాల్లో మరో హీరోను ఊహించుకోవచ్చు కానీ నవీన్ చేసిన మూడు సినిమాలు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో మిమ్మల్ని తప్ప మరో హీరోను ఊహించుకోలేం. డైరెక్టర్ మహేశ్ బాబుకు నా అప్రిషియేషన్స్ చెబుతున్నా. సినిమాను మనసుకు హత్తుకునేలా రూపొందించాడు. యూవీ ప్రొడ్యూసర్స్ తో పాటు మిగతా టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు. అన్నారు.

లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ – యూవీ సంస్థ నాకు మంచి అనుబంధం ఉంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఎలాంటి హడావుడి లేకుండా కామ్ గా వచ్చి హిట్ కొట్టింది. ఒక మంచి పాయింట్ ను మనసుకు హత్తుకునేలా చూపించారు. ఇంకా మరింత పెద్ద సక్సెస్ వైపు ఈ సినిమా వెళ్లాలని కోరుకుంటున్నా. అన్నారు.
సంగీత దర్శకుడు గోపీసుందర్ మాట్లాడుతూ – ఇలాంటి మంచి చిత్రంలో పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది. సినిమా మంచి హిట్ అయ్యింది. నవీన్ యాక్టింగ్ చాలా బాగుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలోని ఎమోషనల్ కంటెంట్ మీ మనసుకు టచ్ అవుతుంది. చూడని వాళ్లు ఉంటే తప్పక ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చూడమని కోరుతున్నా. అన్నారు.

Also Read:ఆసియా కప్ విజేతగా భారత్..

డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ – యూవీ సంస్థలో విక్రమ్ గారు నాకు పరిచయం. చరణ్ గారు రంగస్థలం టైమ్ లో విక్రమ్ గారిని పరిచయం చేశారు. ఆయన ఎంతో మంచివారు. యూవీ సంస్థకు హిట్ రావడం సంతోషంగా ఉంది. నవీన్ నాకు వన్ నేనొక్కడినే సినిమా టైమ్ నుంచి తెలుసు. ఆ సినిమాలో హూ ఆర్ యూ పాటలో నటించాడు. ఆ పాటలో మహేశ్ రాగానే ఒక కుర్రాడు లేచి అరుస్తాడు. అతనే నవీన్. ఆ షాట్ కోసం అడిగి మరీ టేక్స్ చేశాడు. మహేశ్ గారు అన్నారు ఈ కుర్రాడు యాక్టివ్ గా ఉన్నాడు, బాగా పర్ ఫార్మ్ చేస్తున్నాడు.. స్టార్ అవుతాడని. ఆయన అన్నట్లుగానే స్టార్ అయ్యాడు. ఇదంతా నవీన్ లోని తపన, పట్టుదల వల్లే సాధ్యమైంది. ఇంకా ఇలాంటి మరెన్నో హిట్ మూవీస్ నవీన్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ అనుదీప్ కేవీ మాట్లాడుతూ – జాతి రత్నాలు సినిమా టైమ్ లో నాకు డైరెక్టర్ మహేశ్ ఈ కథ చెప్పాడు. అప్పటి నుంచి ఈ స్టోరి మీద వర్క్ చేస్తూనే ఉన్నాడు. నవీన్ కామెడీ మాత్రమే చేస్తాడని అనుకుంటారు కానీ ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ కూడా అంతే బాగా చేయగలిగాడు. ఈ మూవీని మీరంతా మరింత సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

Also Read:మమ్ముట్టి…’భ్రమయుగం’

- Advertisement -