కోడలిపై మెగాస్టార్‌ ప్రశంసల జల్లు..

547
- Advertisement -

లాక్‌డౌన్ ప్రభావంతో సినీ ప‌రిశ్ర‌మ‌లో తిండి లేక నిత్యవసర వస్తువులు కొనుకోలే ఎన్నో ఇబ్బందులు పడుతున్న కార్మికుల‌ని ఆదుకునేందుకు మెగాస్టార్‌ చిరంజీవి నేతృత్వంలో క‌రోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటైన సంగ‌తి తెలిసిందే. అయితే సీసీసీ కి ఇప్పటికే పలువురు హీరోలు,నటీ నటులు తమ వంతుగా ఆర్థిక సాయం అందించారు.కాగా రోజు వారి సినీ కార్మికులకు అండగా నిలవాలన్న అలోచనతో చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన తన వంతు సాయం అందించినంది.

ఈ సందర్భంగా తన కోడలినిప్రశంసిస్తూ చిరంజీవి ఓ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. సీసీసీతో ధ్రువీకరించబడిన.. రోజు వారి సినీ కార్మికులందరికీ ఉచితంగా మందులు అందజేయాలన్న ఆలోచనతో ముందుకొచ్చిన తన కోడలికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చిరు ట్వీట్‌ చేశారు. రోజువారీ సినీ కార్మికులు అన్ని అపోలో ఫార్మసీ స్టోర్ల ద్వారా ఈ మందులు పొందవచ్చని అన్నారు.

- Advertisement -