కొత్తగా 472 పాజిటివ్ కేసులు- లవ్ అగర్వాల్

371
Love Agarwal

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇక భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 79కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో ఈ రోజు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా 274 జిల్లాల్లో ‘కరోనా’ ప్రభావం ఉందని అన్నారు. నిన్నటి నుంచి కొత్తగా 472 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 3374 కు చేరిందని చెప్పారు. గత ఇరవై నాలుగు గంటల్లో 11 మంది మృతి చెందగా, 267 మంది కోలుకున్నారని వివరించారు. ‘కరోనా’ కట్టడికి ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా పాటించాలని మరోమారు సూచించారు.