తెలంగాణ కోసమే బీఆర్‌ఎస్‌లో చేరా:జీవన్‌ రెడ్డి

8
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కేసీఆర్ రాకతోనే ప్రభుత్వంలో చలనం మొదలైందని ఆయన ఎద్దేవా చేశారు.

కేసీఆర్ .. జగిత్యాలకు వస్తున్నారని తెలిసి, నిన్నటిదాకా నిద్రపోయిన రేవంత్ రెడ్డి ఇవాళ మేడిగడ్డ దగ్గరికి వెళ్లారు” అని జీవన్ రెడ్డి విమర్శించారు. కేవలం రెండు పిల్లర్లు కుంగిన మేడిగడ్డపై ఇంత రాద్ధాంతం చేస్తున్న రేవంత్ రెడ్డి, గతంలో ఎస్ఎల్బీసీ (SLBC) నిర్మాణ దశలో కుంగిపోయినప్పుడు 8 మంది కార్మికుల శవాలను కూడా తీయలేకపోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని మండిపడ్డారు. రెండేళ్లు అద్భుతంగా నడిచిన మేడిగడ్డను పట్టించుకోకుండా వదిలేస్తే, రేపు కరువు వస్తే రైతుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.

రైతు సంక్షేమంపై రేవంత్ సర్కార్ తీరును జీవన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పటికే మూడు సార్లు రైతుబంధుకు ప్రభుత్వం ఎగనామం పెట్టిందని ఆరోపించారు. ఎకరానికి రూ.15 వేలు ఇస్తానని చెప్పి, ఇప్పుడు పాత పద్ధతిలో ఇచ్చే రూ.10 వేలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని విమర్శించారు.

గిమ్మిక్కులు: ఇవాళ జగిత్యాలకు కేసీఆర్ వస్తున్నారని భయపడి, హడావిడిగా ఏదో ఒక ఎకరానికి రైతుబంధు వేసి సభలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.జగిత్యాల సభ వేదికగా కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతో కాంగ్రెస్ నుండి భారీగా నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు మరియు మాజీ జెడ్పీటీసీలు ఉన్నారు.ఈ చేరికలతో జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అయ్యిందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -