ఆచార్యపై పెదవి విప్పిన మెగాస్టార్‌

51
- Advertisement -

భారీ అంచనాల మధ్య విడుదలైన ఆచార్య పరాజయంపై మెగాస్టార్‌ చిరంజీవి తొలిసారి పెదవి విప్పారు. ఆచార్య పరాజయంపై తొలిసారి స్పందించిన చిరంజీవి… డైరెక్టర్‌ చేప్పిందే మేం చేశామన్నారు. గాడ్‌ఫాదర్‌ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన ఆచార్య సినిమాపై క్లారిటీ ఇచ్చారు. సినిమా ఫలితం మన చేతుల్లో ఉండదు.

ఆచార్య సినిమా అపజయం తనను ఏమాత్రం బాధించలేదన్నారు. కానీ నేను చరణ్‌ చేసిన తొలిసినిమా పరాజయం పొందడం కొంతవరకు బాధించిందన్నారు. ఒక వేళ భవిష్యత్తులో మేము మళ్లీ కలిసి పనిచేయాలనుకుంటే ఇంతటి జోష్‌ ఉండకపోవచ్చున్నారు. అంతకు మించి ఎలాంటి బాధ లేదు అని చిరంజీవి వివరించారు.

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య మూవీలో చిరంజీవి, రాంచరణ్‌, సోన్‌సుద్‌, పూజహెగ్డే తదితరులు నటించారు. కొణిదేల ప్రోడక్షన్‌లో నిర్మితమయిన ఆచార్య 2022 ఏప్రిల్‌ 29న విడుదలైంది. ప్రస్తుతం మెగాస్టార్‌ గాడ్‌ఫాదర్‌ మూవీ చేశారు. ఇది అక్టోబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. మలయాళంలో హిట్‌ అయిన లూసిఫర్‌ మూవీ రీమేక్‌గా గాడ్‌ఫాదర్‌ సినిమా మోహన్‌ రాజా తెరకెక్కించారు.

- Advertisement -