అక్టోబర్‌2న సండే ఫన్‌డే @ ట్యాంక్‌ బండ్‌

171
- Advertisement -

సండే ఫన్‌డే కార్య‌క్ర‌మానికి హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ మ‌రోసారి వేదిక కానుంది. చాలా రోజుల త‌ర్వాత ఈ ఆదివారం సండ్ ఫ‌న్‌డేను నిర్వ‌హించ‌నున్న‌ట్లు అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ చీఫ్ స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ అర‌వింద్ కుమార్ ట్వీట్ చేశారు.

అక్టోబ‌ర్ 2వ తేదీన సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలతో పాటు  ద‌స‌రా వేడుక‌ల‌ను త‌ల‌పించేలా కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయ‌నున్నారు. తినుబండారాలు, హ్యాండ్లూమ్స్‌, హ్యాండిక్రాఫ్ట్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయ‌నున్నారు.

సండ్ ఫ‌న్‌డే నేప‌థ్యంలో ట్యాంక్‌బండ్‌తో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు. విజిట‌ర్ల‌కు ప్ర‌త్యేక పార్కింగ్ స‌దుపాయం క‌ల్పించ‌నున్నారు.

- Advertisement -