మెగాస్టార్‌ నజభజ జజర సాంగ్‌ విడుదల

136
chiranajeevi
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న గాడ్ ఫాద‌ర్‌ నుంచి మరో సాంగ్ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఇదివరకే మొదటి పాటను విడుదల చేయగా తాజాగా మేక‌ర్స్ న‌జ‌భ‌జ జ‌జ‌ర‌ లిరిక‌ల్ రెండవ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాట‌ను శ్రీ కృష్ణ‌, పృథ్విచంద్ర పాడారు. ఈ పాట థ‌మ‌న్ మార్క్ మ్యూజిక్‌తో గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతుంది.

మోహ‌న్ రాజా డైరెక్ట్ చేస్తున్న గాడ్ ఫాద‌ర్‌ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది. గాడ్ ఫాద‌ర్ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్, డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, సునీల్‌, స‌త్య‌దేవ్‌, న‌య‌న‌తార కీ రోల్స్ లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన థార్ మార్ థ‌క్క‌ర్ మార్ నెట్టింటిని షేక్ చేస్తోంది.

- Advertisement -