‘శ‌శి’ టీజ‌ర్‌ లాంఛ్ చేసిన మెగాస్టార్..

173
megaster
- Advertisement -

ఆది సాయికుమార్ హీరోగా శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘శ‌శి’. సుర‌భి నాయిక‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ఆర్‌.పి. వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు నిర్మిస్తున్నారు. ల‌వ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. బుధ‌వారం ఆది సాయికుమార్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ‘శ‌శి’ టీజ‌ర్‌ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌ల‌య్యింది.

చిరంజీవి మాట్లాడుతూ.. “నా మిత్రుడు సాయికుమార్ త‌న‌యుడు ఆది హీరోగా న‌టించిన చిత్రం ‘శశి’. టీజ‌ర్ చూస్తుంటే చాలా ర‌గ్‌డ్ ల‌వ్ స్టోరీలా అనిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఆది ఓ స్వీట్ ల‌వ‌ర్ బాయ్ లాగా, ఓ చాక్లెట్ బాయ్ లాగా క‌నిపించాడు. ‘శ‌శి’ టీజ‌ర్‌లో అత‌డిని చూస్తుంటే.. మ్యాచోగా, దృఢ‌మైన బాడీతో చాలా బాగా క‌నిపిస్తున్నాడు. మంచి ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌. ఈ సినిమాతో ఆది క‌చ్చితంగా ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ను పొందుతాడ‌నే ప్ర‌గాఢ న‌మ్మ‌కం నాకుంది. ఇలాంటి ఫ్రెష్ స‌బ్జెక్ట్స్ రావాలంటే ఫ్రెష్ థాట్స్ ఉండాలి. అలాంటి థాట్స్ డైరెక్ట‌ర్స్ ద‌గ్గ‌రే ఉంటాయి. అలాంటి డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్ నాయుడు. మంచి క‌థ‌తో ఈ సినిమాని చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ వాళ్లు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు, టెక్నీషియ‌న్స్, న‌టీన‌టుల‌ద‌రికీ నా ప్ర‌త్యేక అభినంద‌న‌లు. ఆదికి ఈ సినిమా మంచి బ్రేక్ అవ్వాల‌నీ, మంచి విజ‌యం సాధించాల‌నీ ఆకాంక్షిస్తున్నా. ఆదికి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నా శుభాకాంక్ష‌లు. హ్య‌పీ బ‌ర్త్‌డే మై బాయ్‌. సాయికుమార్‌, నేను క‌లిసి సినిమాలు చేస్తున్న‌ప్పుడు ఆది పుట్టాడు. అలాంటి చిన్న‌బిడ్డ‌లు ఇవాళ పెద్ద‌వాళ్లై ఈ గ్లామ‌ర్ ఫీల్డ్‌ను ఎంచుకొని, ఇందులో విజ‌యం సాధించ‌డం కోసం వాళ్లు చేస్తున్న ప్ర‌య‌త్నం అన్ని విధాలా స‌ఫ‌లీకృతం కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొత్తం సినిమా టీమ్‌కు ఆల్ ద బెస్ట్” అన్నారు.

ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. “నా బ‌ర్త్‌డేకి ‘శ‌శి’ టీజ‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి గారు లాంచ్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. నా లుక్ మ్యాన్లీగా చాలా బాగుంద‌ని చెప్ప‌డం హ్యాపీ. ఆయ‌న‌కు థాంక్స్‌. ‘శ‌శి’ ఒక ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీ. అంద‌రికీ న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నాం” అన్నారు.

సాయికుమార్ మాట్లాడుతూ.. “ఆది తొలి సినిమా ‘ప్రేమ కావాలి’కి అన్న‌య్య విషెస్ ల‌భించాయి. ఇప్పుడు ఆది బ‌ర్త్‌డేకి ‘శ‌శి’ టీజ‌ర్‌ను ఆయ‌న లాంచ్ చేసి, బ్లెస్సింగ్స్ ఇవ్వ‌డం ఆనందంగా ఉంది.” అన్నారు. త‌మ‌ హీరో ఆది బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిరంజీవి గారి చేతుల మీదుగా ‘శ‌శి’ టీజ‌ర్ రిలీజ్ అయినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంద‌న్నారు.

తారాగ‌ణం:ఆది సాయికుమార్‌, సుర‌భి, రాజీవ్ క‌న‌కాల‌, జ‌య‌ప్ర‌కాష్‌, అజ‌య్‌, వెన్నెల కిశోర్‌, రాశీ సింగ్‌, తుల‌సి.
సాంకేతిక బృందం:
ద‌ర్శ‌కుడు: శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల‌
నిర్మాత‌లు: ఆర్‌.పి. వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు
సినిమాటోగ్రీఫీ: అమ‌ర‌నాథ్ బొమ్మిరెడ్డి
మ్యూజిక్‌: అరుణ్ చిలువేరు
ఎడిటింగ్‌: స‌త్య జి.
డైలాగ్స్‌: ఐ. ర‌వి
ఆర్ట్‌: ర‌ఘు కుల‌క‌ర్ణి
కొరియోగ్ర‌ఫీ: విశ్వ ర‌ఘు
ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: రాఘ‌వ చౌద‌రి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

- Advertisement -