కొప్పుల ట్ర‌స్ట్‌ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం..

217
minister koppula
- Advertisement -

పెద్ద‌ప‌ల్లి జిల్లాలోని ధ‌ర్మారం మండ‌లం దొంగ‌తుర్తి గ్రామంలో ఈ నెల 22న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎల్ఎం కొప్పుల చారిట‌బుల్ ట్ర‌స్ట్‌, ప్ర‌తిమ ఫౌండేష‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్ సంయుక్తంగా మెడిక‌ల్ క్యాంప్‌ను ఏర్పాటు చేయనున్నారు. స్థానిక జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో నిర్వ‌హించే ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి సంబంధించిన బ్రోచ‌ర్‌, క‌ర‌ప‌త్రాలను మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ఆవిష్క‌రించారు. శ‌నివారం క‌రీంన‌గ‌ర్ క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ట్ర‌స్ట్ చైర్‌ప‌ర్స‌న్ కొప్పుల స్నేహ‌ల‌త‌, కొప్పుల ఈశ్వ‌ర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -