ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శనకు ‘గతం’ సినిమా ఎంపిక..

46
gatham

గోవాలో జరగనున్న 51వ భారత అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కోసం చిత్రాలను ఎంపిక చేసింది కేంద్ర సమాచార ప్రసార శాఖ. ఇండియన్‌ పనోరమ ఫీచర్‌ కేటగిరీలో 23 చిత్రాలను, నాన్‌ఫీచర్‌ కేటగిరీలో 20 సినిమాలను ఎంపిక చేస్తూ జాబితాను మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. తెలుగు నుంచి ‘గతం’ సినిమా ప్రదర్శనకు ఎంపికైంది.

థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘గతం’ సినిమాను విదేశాల్లో చిత్రీకరించారు. నవంబర్ 6న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో(IFFI)లోని ఇండియన్ పనోరమా కేటగిరీలో ప్రదర్శితం కానున్న ఏకైక తెలుగు సినిమాగా నిలిచింది.