నిరాశ్రయులైన ఆడబిడ్డలకు అండగా నిలిచిన మంత్రి హరీష్‌..

161
harish
- Advertisement -

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌ రావు తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. అపదలో ఉన్న వారిని నేన్నానంటు ముందుంటారు హరీషన్న. ఇళ్లు కూలి నిరాశ్రయులైన ఆడబిడ్డలకు అండగా నిలిచారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు దొంతరబోయిన బాలమణికి చెందిన ఇళ్లు కూలిపోయింది. దీంతో తల్లి, కూతురు స్రవంతి నిరాశ్రయులయ్యారు. 8 ఏళ్ల కిందటే తండ్రి రాజయ్య గుండెపోటుతో మృతి చెందాడు. ఆర్థికంగా చితికిపోయి కొట్టుమిట్టాడే ఇంట్లో పెండ్లి ఈడుకొచ్చిన ఆడపిల్ల స్రవంతి పశువులను కాపరిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.

వీరి కుటుంబ దీన‌స్థితి తెలిసిన మంత్రి హ‌రీష్‌ వెంటనే స్పందించారు. కూలిన ఇళ్లు చోట మరమ్మత్తులు చేయించి కొత్త ఇళ్లు కట్టించారు మంత్రి. అయితే శ‌నివారం జ‌రిగిన గృహ‌ప్ర‌వేశానికి మంత్రి హ‌రీష్‌ హాజ‌ర‌య్యారు. త‌ల్లి, కూతురుకు కానుక‌గా కొత్త దుస్తులు అందించి, మిఠాయిలు తినిపించారు. ప‌ది కాలాలు స‌ల్లంగా ఉండాల‌ని దీవెన‌లు అందించారు. పెద్దదిక్కు లేని పేదరికంలో ఉన్న ఆ ఇంటికి అన్నలా అండ‌గా నిలిచారు మంత్రి హరీష్‌ రావు.

- Advertisement -