ఆమె పై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి

32
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. అయితే చిరు మరో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బింబిసార డైరెక్టర్ వశిష్ఠతో చిరు తన తదుపరి చిత్రం చేయనున్నారు. ఈ సినిమాలో త్రిషను కథానాయికగా ఖరారు చేసుకున్నట్లు ఓ వార్త షికారు చేస్తోంది. ఇదే నిజమైతే 15 ఏళ్ళ తర్వాత హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతున్నట్లు. గతంలో స్టాలిన్ లో చిరంజీవి సరసన త్రిష సందడి చేసింది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా త్రిషని ఓకే చేయడం తమకు నచ్చలేదు అంటూ మరోపక్క మెగా ఫ్యాన్స్ నెగిటివ్ ట్వీట్స్ చేస్తూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

అలాగే చిరంజీవి తనయుడి పాత్రలో సిద్దూ జొన్నలగడ్డ కనిపించనున్నారని తెలుస్తోంది. దీనిబట్టి మెగాస్టార్ ఈ సినిమాలో ఏభై ఐదేళ్ల వ్యక్తిగా కనిపించబోతున్నాడు. పైగా ఈ సినిమాను మెగాస్టార్ కూతురు సుస్మిత భారీ బడ్జెట్ తో సొంత బ్యానర్ లో నిర్మిస్తూ ఉండటం విశేషం. ఎంతైనా బింబిసార సినిమాతో సూప‌ర్ హిట్టు కొట్టాడు వశిష్ఠ. కాబట్టి, ఈ సినిమా పై అంచనాలు ఉంటాయి. దీనికితోడు మెగాస్టార్ చిరంజీవి కోసం శ్రీ వశిష్ఠ ఓ అద్భుతమైన కథను రాసుకున్నాడట.

Also Read: భగవంత్ కేసరిలో శ్రీలల..

నిజానికి వశిష్ఠ మెగాస్టార్ తో ఓ సినిమా చేయాల‌ని కార్తీ ఎప్ప‌టి నుంచో ప్ర‌యత్నిస్తున్నాడు. పైగా వశిష్ఠ చెప్పిన కథ చిరుకు చాలా బాగా నచ్చింది. అందుకే వశిష్ఠతో సినిమా చేయాల‌ని మెగాస్టార్ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక త్వ‌ర‌లోనే ఈ కాంబోకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

Also Read: అవంతికకు గుర్తింపు రాలేదట..!

- Advertisement -