పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం..

410
talasani
- Advertisement -

ప్రపంచ పశు వైద్య దినోత్సవం సందర్భంగా పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ విద్యానగర్ లోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు ఎమ్మెల్యే ముఠా గోపాల్, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డా. లక్ష్మారెడ్డి తదితరులు హాజరయ్యారు.

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో రక్త నిల్వల కొరత ఏర్పడిందన్నారు మంత్రి తలసాని. పశు సంవర్ధక శాఖ ఉద్యోగులు ముందుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు. పశు వైద్యం, పశు గ్రాసం విషయంలోనూ సిబ్బంది చురుగ్గా పనిచేస్తున్నారని తెలిపారు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వెటర్నరీ డాక్టర్లు రక్తదానం చేయడం గొప్ప విషయం అన్నారు ఎమ్మెల్యే ముఠా గోపాల్.అత్యవసర సమయాల్లో రక్తదానం చేసేందుకు అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది పశు వైద్య సిబ్బంది రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా. లక్ష్మారెడ్డి. పశు సంరక్షణ, మాంసం, పాల ఉత్పత్తిలో దేశంలోనే ముందు వరుసలో ఉన్నామని..ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ చేసిందని..భవిష్యత్తులో తెలంగాణలో రెడ్ మీట్ విప్లవం చూస్తాం అన్నారు.

- Advertisement -