రైతుబజారును తనిఖీచేసిన మర్రి జనార్ధర్ రెడ్డి

405
marri janardhan reddy
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రైతు బజారును ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులతో మాట్లాడుతూ కూరగాయల ధరలేంటీ, తాత్కాలిక మార్కెట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయా అని ఆరా తీశారు.

కరోనా వైరస్ నేపథ్యంలో వ్యాపారం ఎలా నడుస్తుంది అని తెలుసుకున్నారు మార్కెట్లో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని రైతులకు, వినియోగ దారులకు సూచించారు,మాస్క్ పెట్టుకొని వచ్చిన వారికి మాత్రమే కూరగాయలు అమ్మాలి అని సూచించారు,తమకు అనుకూలంగానే ధరలున్నాయని వినియోగదారులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు,అన్ని వసతులున్నాయి..ఇబ్బందులేమి లేవని రైతులు తెలిపారు.

అనంతరం మార్కెట్ లో రైతులకు వినియోగదారులకు మస్కులను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పంపిణీ చేశారు,మార్కెట్ లో పలువురు రైతులతో ఆప్యాయంగా మాట్లాడుతూ కరోన వైరస్ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు,ముందు జాగ్రత్తగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి అని ఎమ్మెల్యే విన్నవించారు,ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.

- Advertisement -