రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ

360
Kcr Jagan
- Advertisement -

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి రేపు భేటీ కానున్నారు. తెలంగాణ సీఎం క్యాంపు ఆఫీస్ ప్రగతి భవన్ లో వీరివురు సమావేశం కానున్నారు.

jagan-kcr

గోదావరి జలాలను శ్రీశైలం రిజర్వాయర్‌కు తరలించే అంశంతోపాటు, అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కృష్ణా గోదావరి నదుల అనుసంధానంపై చర్చించనున్నారు.హైదరాబాద్‌లో ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. సీఎంలు కేసీఆర్,జగన్‌లతో పాటు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.

గతంలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా, ఇంజినీర్లు రూపొందించిన ప్రతిపాదనలపై చర్చించి ఈ సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -