విడాకుల బాటలో పవన్ హీరోయిన్‌..!

516
Meera Jasmine headed for divorce?
- Advertisement -

సినిమాల్లోని ట్విస్టుల లాగే ఈ సినిమా వాళ్ల పెళ్లి జీవితాలు ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో ఎవరికీ అర్థం కావు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తారల మధ్య వివాదాలు, విడాకులు అన్నవి ఇటీవల కాస్త ఎక్కువగానే చూస్తున్నాం. ఇటీవలే అమలాపాల్- ఏల్ విజయ్ జంట విడాకులు కోసం కోర్టుకెక్కగా…సూపర్ స్టార్ రజనీ కాంత్ రెండో కూతురు సౌందర్య సైతం విడాకులకు అప్లై చేసింది. ఇప్పుడు తాజాగా పవన్ హీరోయిన్ మీరా జాస్మిన్ వంతు వచ్చింది.తెలుగులో ‘గుడంబా శంకర్‌’, ‘భద్ర’ వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్‌ మీరా జాస్మిన్‌. టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా..మీరా జాస్మిన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. టాలీవుడ్‌లో పెద్దగా సక్సెస్‌ఫుల్‌ కాలేకపోయిన ఈ ముద్దుగుమ్మ తమిళం, మలయాళం సినిమాల్లో మాత్రం టాప్‌హీరోయిన్‌గా కొనసాగింది. కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడే రాజేష్‌ అనే సంగీతకారుడితో ప్రేమాయణం సాగించి వార్తల్లో నిలిచింది. అయితే ఆ ప్రేమ ఎంతోకాలం సాగలేదు.

Meera Jasmine headed for divorce?

రాజేష్‌తో ప్రేమ పెళ్లి పీటలు ఎక్కక ముందే అతనితో మనస్పర్ధలు ఏర్పడటంతో వివాహ ఆలోచన విరమించుకొంది. తరువాత దుబాయ్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైసన్ ని 2014, ఫిబ్రవరి 9న కేరళలోని ఒక చర్చిలో వివాహం చేసుకొంది. అతనికి అప్పటికే వివాహం అయిన సంగతి తెలిసినా వివాహం చేసుకొంది. అయితే జాస్మిన్ తో వివాహ సమయానికి అతను మొదటి భార్యకి విడాకులు ఇవ్వకపోవడంతో వారి వివాహాన్ని రిజిస్టర్ చేయించుకోలేకపోయారు.

Meera Jasmine headed for divorce?

అయితే ఇప్పుడు ఈ బంధానికి బీటలు పడినట్టు సమాచారం. పెళ్లయిన రెండేళ్లకే వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏడాది నుంచి అనిల్‌కు మీరా దూరంగా ఉంటోందట. అనిల్ తో వివాహం అయిన తరువాత కూడా మీరా జాస్మిన్ సినిమాలు చేస్తుండటంతో వారి మద్య విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే ఆమె భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం ఆమె రెండు మలయాళం సినిమాలలో నటిస్తోంది. తెలుగులో కూడా నటించే అవకాశం ఉంది.

- Advertisement -