- Advertisement -
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది నటి మీరా చోప్రా. తనపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మీరా చోప్రా ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ట్విట్టర్‌లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారి వివరాలను సేకరించారు.
అసలేం జరిగిందంటే…సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు మీరా చోప్రా. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గురించి ఓ నెటిజన్ ప్రశ్న అడగగా పవన్..సూపర్ స్టార్ మంచి వ్యక్తని చెప్పుకొచ్చింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ నెటిజన్ అడగగా ఆయనెవరో తనకు తెలియదని…సినిమాలు కూడా చేయలేదని తెలిపింది. దీంతో అప్పటినుండి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రాపై అసభ్యకర కామెంట్లు పోస్టు చేశారు.
- Advertisement -