అసమర్థపు కేంద్రానికి జీఎస్టీ కూడా చెల్లించాలా..?: మీరా చోప్రా

66
meera

తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ మీరా చోప్రా. ప్రస్తుతం బాలీవుడ్‌లో గ్యాంగ్స్ ఆఫ్ గోస్ట్స్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్న మీరా…కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో మండిపడింది.

కొవిడ్‌ కష్టకాలంలో అనేక మంది కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో పడకలు లభించక, ఒక వేళ బెడ్‌ దొరికినా ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పో తున్నారు. ఇలాంటి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలకు కనీసం ఆస్పత్రిలో పడక సౌకర్యం కల్పించలేనపుడు 18 శాతం జీఎస్టీ ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. తక్షణం ఈ 18 శాతం జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు.

కరోనాతో ఆమె కుటుంబంలో ఇద్దరు చనిపోయారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన బంగారం సినిమాలో నటించారు.