మేడారం మహాజాతర షురువైంది. నాలుగు రోజుల పాటు జరిగే జాతర ఇవాళ్టి నుండి మొదలుకానుంది. అశేష భక్త జనవాహిని తరలిరాగా కన్నేపల్లి నుండి సారలమ్మ తల్లి ప్రతిష్ట జరగనుంది. అమ్మవార్లకు ప్రీతిపాత్రమైన మాఘ శుద్ధ పౌర్ణమికి ముందు బుధవారంను వన దేవతల వారంగా భావిస్తారు.
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరకు పేరుంది. రెండేళ్లకోసారి ఈ జాతర జరుగుతుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో జాతర మొదలుకానుండగా నాలుగో రోజు శనివారం గద్దెలపై ఉన్న తల్లులకు మొక్కులు అనంతరం సాయంత్రం 6 గంటల తర్వాత సమ్మక్క చిలుకలగుట్టకు, సారలమ్మ కన్నెపల్లికి, పగిడిద్ద రాజు పూనుగొండ్లకు, గోవిందరాజులు కొండాయికి తిరుగు పయనం అవుతారు. దీంతో మేడారం మహాజాతర ముగుస్తుంది.
రెండో రోజు గురువారం చిలకలగుట్టపై నుంచి సమ్మక్కను ప్రభుత్వ లాంఛనాలతో గద్దెపైకి తీసుకొస్తారు. సమ్మక్క గద్దెలపైకి చేరటంతో జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది. మూడో రోజు శుక్రవారం గిరిజనుల ఆరాధ్యదైవాలైన సారలమ్మ, సమ్మక్కలు గద్దెపైకి చేరటంతో శుక్రవారం తల్లులకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. ఈనెల 23న రాష్ట్రపతి, సీఎం సహా ప్రముఖులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.
Also Read:మగవారికే బట్టతల ఎక్కువ.. ఎందుకు ?