ఇమ్లిబన్ ట్రాన్స్ఫర్ స్టేషన్‌లో మంగళవారం నాడు జరిగిన ప్రమాదంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి హజీ ఖాన్ కుటుంబానికి రూ13.50 లక్షల పరిహారాన్ని అందిస్తున్నట్టు నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. మంగళవారం జరిగిన ప్రమాదంలో అటు అవుట్సోర్సింగ్ ఉద్యోగి హాజీ కాన్ మృతి చెందిన విషయం విదితమే. ఈ ఇద్దిరి కుటుంబాలలో అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించడంతో పాటు ఒక్కరికి మేయర్ నిధుల నుండి రెండు లక్షల రూపాయలను ఎక్ష్ గ్రెశియా ప్రకటిస్తున్నట్లు మేయర్ తెలిపారు.
శాశ్వత ఉద్యోగి ఆరీఫ్‌కు ప్రభుత్వ నిబండనల ప్రకారం అన్ని విధాల ఆర్డిక పరమైన బెనిఫిట్లను అంద చేస్తామని చెప్పారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి హాజీ ఖాన్‌కు మేయర్ నిధులు రూ.2లక్షలతో కలిపి నిన్న ప్రకటించిన రూ. 6.50 లక్షలకు అదనంగా కార్మిక భీమా మొత్తం రూ. 6 లక్షలు కలిపి ఇస్తామని మేయర్ ప్రకటించారు.
హాజిఖాన్ కుటుంబానికి మొత్తం రూ.13.50లక్షలను అంద చేస్తున్నట్లు ప్రకటన చేశారు. జీహెచ్ ఎంసీ కార్మికుల సంక్షేమానికై అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, దీనిలో భాగంగా బల్దియాలోని మొత్తం 24వేల మంది కార్మికులకు ప్రత్యేకంగా భీమా సౌకర్యాన్ని కల్పించామని మేయర్ పేర్కొన్నారు.