సాహో.. స్టైలిష్ యాక్షన్ క్యారెక్టర్‌లో చుంకి పాండే…

446
Chunky Pandey
- Advertisement -

సాహో విడుదలకు రెడీ అయ్యేందుకు సిద్ధమౌతోన్న సందర్భంలో…. సినిమాలో నటించిన ఒక్కో పాత్ర ను పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముక్షేష్, అరుణ్ విజయ్ లుక్స్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నటుడు చుంకీ పాండే లుక్ ని విడుదల చేశారు. బాలీవుడ్ మూవీ హౌస్ ఫుల్ సినిమా చూసిన వాళ్లకు చుంకీ పాండేని మర్చిపోరు. పలు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ప్రెస్టీజియస్ సాహో సినిమాలో యాక్షన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు.

Chunky Pandey in saaho

కామెడీ క్యారెక్టర్ చేయడంలో చుంకీ పాండే అందే వేసిన చేయి. అలాంటిది… ఇప్పుడు యాక్షన్ చేయబోతున్నాడు. విభిన్నమైన పాత్రలో సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. స్టైలిష్ యాక్షన్ రోల్‌లో చుంకీ పాండే నటించనున్నాడు. ఈ క్యారెక్టర్ పోస్టర్‌ను ఈ రోజు విడుదల చేశారు. “Rise from the Ashes.” అనే పవర్ ఫుల్ క్యాప్షన్‌తో కూడిన ఈ పోస్టర్‌ని చూస్తేనే అర్థమౌతోంది. చుంకీ పాండే ఎంతటి సీరియస్ పాత్ర పోషిస్తున్నాడో.. భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ప్యాక్ డ్ సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంది. అలాగే చుంకీ పాండే పాత్ర సినిమాలో చాలా కీలకం.

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ జంట‌గా యు.వీ క్రియేష‌న్స్ ప‌తాకం పై వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్ లు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం సాహో. యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కుతుంది. ఈ చిత్రం అగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు.. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్, శ్రధ్ధాక‌పూర్‌, జాకీష‌ర‌ఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా త‌దిత‌రులు.

- Advertisement -