శేరిలింగంపల్లి జోనల్ ఆఫీసు నుండి వయా మంజీరాపైప్ లైన్ ద్వారా చందానగర్ ( జాతీయ రహదారి -65 )వరకు నిర్మిస్తున్న మిస్సింగ్ లింక్ రోడ్డు పనులను జి హెచ్ ఎం సి మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ లు తనిఖీ చేశారు.
150 అడుగుల వెడల్పుతో 4 లేన్లుగా 1.75 కిలోమీటర్లు పొడవున నిర్మిస్తున్న ఈ మిస్సింగ్ లింక్ రోడ్డు పనులను జూలై నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.2.75 కిలోమీటర్లు వున్న ఈ మిస్సింగ్ లింక్ రోడ్డు లో భాగంగా 4 లేన్ల రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే అధికారులతో కలిసి హెచ్ ఆర్ డి సి ఎల్ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించారు
రైల్వే అధికారుల నుండి ఆమోదం లభించిన వెంటనే అండర్ బ్రిడ్జి పనులు చేపట్టనున్నారు.రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ఆదేశాలు ప్రకారం నగరంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ, రోడ్లు విస్తరణ పనులు చేపట్టినట్లు మేయర్ తెలిపారు.
అందులో భాగంగా నగరంలోని ప్రధాన రహదారులపై వత్తిడిని తగ్గించుటలో పాటు దూరాన్ని, ప్రయాణ సమయాన్ని తగ్గించుటకు 4 ప్యాకేజీలుగా రూ.313 కోట్ల 65 లక్షలు వ్యయంతో 44.63 కిలోమీటర్ల 37 మిస్సింగ్ లింక్ రోడ్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
పాకేజీ -ఎ1 లో భాగంగా రూ. 79 కోట్ల 87 లక్షలు వ్యయంతో 10 పనుల కింద నిర్మిస్తున్న 11.6 కిలోమీటర్లు మిస్సింగ్ లింక్ రోడ్లులో శేరిలింగంపల్లి జోనల్ ఆఫీసు నుండి చందానగర్ మిస్సింగ్ లింక్ రోడ్డు ఉన్నట్లు తెలిపారు.
ప్యాకేజీ- ఎ 2 లో రూ 76 కోట్ల 30 లక్షలతో 10.84 కిలోమీటర్లు పొడవున 8 మిస్సింగ్ లింక్ రోడ్లు.
- ప్యాకేజీ -బి1 కింద రూ91 కోట్ల 02 లక్షలతో 9.55 కిలోమీటర్లు పొడవున 8 మిస్సింగ్ లింక్ రోడ్లు.
- పాకేజీ – బి 2 లో భాగంగా రూ 66 కోట్ల 46 లక్షలతో 12.64 కిలోమీటర్లు 11 మిస్సింగ్ లింక్ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
- మిస్సింగ్ లింక్ రోడ్ల పనులు వేగంగా జరుగుతున్నాయని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఈ పర్యటనలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, జోనల్ కమీషనర్ ఎన్ రవికిరణ్, హెచ్ ఆర్ డి సి ఎల్ చీఫ్ ఇంజనీర్ డాక్టర్ సి. వసంత, ఈ ఈ సత్తార్ సింగ్, సిటీ ప్లానర్ ఏ కె రెడ్డి, డి ఈ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.